Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home Latest News అమెరికా వైట్‍హౌస్ సమీపంలో మరోసారి భద్రతా వైఫల్యం..

అమెరికా వైట్‍హౌస్ సమీపంలో మరోసారి భద్రతా వైఫల్యం..

by CVR NEWS
అమెరికా వైట్‍హౌస్ సమీపంలో మరోసారి భద్రతా వైఫల్యం

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. వైట్‌హౌస్ సమీపంలో భద్రతా బలగాలపై ఓ సాయుధుడు కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల ఘటన కారణంగా కొద్దిసేపు వైట్‌హౌస్‌ను మూసేశారు. మీడియా సిబ్బందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పరిసర ప్రాంతాల్లో రోడ్లను మూసివేశారు. ఈ కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటికి ముందే ఆ రోడ్డులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాన్వాయ్ వెళ్లింది. ఆ కాల్పులు జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. కాగా, ఈ దాడి నేరుగా వైట్‌హౌస్‌ను టార్గెట్ చేసింది కాదని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఒక అనుమానితుడిపై కాల్పులు జరిపారు. గాయపడిన అనుమానితుడిని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు.

Advertisements

You may also like

Our Visitor

014992
Total views : 81443

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.