తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. అనంతరం అధికారులతో చంద్రబాబు సమీక్ష చేశారు. తిరుమలలో సౌకర్యాలు, భక్తులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. ఏఐ సాయంతో శ్రీవారిని భక్తులు త్వరగా దర్శించుకునేలా టీటీడీ ప్లాన్ చేస్తోంది.. ఈ మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలను అత్యంత ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి, వనరులను సమర్థవంతంగా వినియోగించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. లడ్డూల తయారీ, విక్రయాలు, నిల్వ వంటి అంశాలను కూడా సమగ్రంగా పర్యవేక్షిస్తున్నామన్నారు.
తిరుమలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు చంద్రబాబు ముందుగానే సమస్యల్ని గుర్తించి వెంటనే పరిష్కారం చూపే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని టీటీడీ అధికారులకు సూచించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా.. తిరుమలలో భక్తులు క్యూలైన్లలోకి ప్రవేశించిన దగ్గర నుంచి.. స్వామివారి దర్శనం పూర్తి చేసి తిరుగు ప్రయాణం అయ్యే వరకు వారికి అందుతున్న సౌకర్యాలను పర్యవేక్షించాలన్నారు. తిరుమలలో అత్యాధునిక సీసీ కెమెరాలు, ఫేషియల్ రికగ్నేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేసి.. తిరుమల పవిత్రతకు భంగం కలిగించే చర్యలను అరికట్టాలని సూచనలు చేశారు. అయితే ఇప్పటికే ఈ వ్యవస్థను ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి అధికారులు వివరించారు. ఏఐ సాయంతో దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని మరింత తగ్గించేలా టీటీడీ ప్లాన్ చేస్తోంది. క్యూ లైన్ల నిర్వహణను టెక్నాలజీ సాయంతో క్రమబద్ధీకరించి, భక్తులకు తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం కలిగేలా చర్యలు తీసుకోనుంది.





Total views : 75428