Tuesday, September 29, 2026
News Navigation
Tuesday, September 29, 2026
News Navigation

Breaking

Tuesday, September 29, 2026
Home Devotional వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి భక్తుల రద్దీ.

వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానానికి భక్తుల రద్దీ.

by CVR NEWS

పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వరుసగా రెండు రోజుల సెలవులు రావడంతో శనివారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.స్వయంభు శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకోవడానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, దర్శనానికి దీర్ఘ సమయం పడుతున్న నేపథ్యంలో ఆలయ చైర్మన్ మనీ నాయుడు, ఈవో పేంచల కిషోర్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. క్యూలైన్ల నిర్వహణ, తాగునీటి సదుపాయం, అన్నప్రసాదం పంపిణీ వంటి ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు.భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లు కూడా కట్టుదిట్టం చేశారు. భక్తులు సహనంతో వ్యవహరించి ఆలయ సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: