అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మరోసారి భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. వైట్‌హౌస్ సమీపంలో భద్రతా బలగాలపై ఓ సాయుధుడు కాల్పులకు దిగాడు. ఈ కాల్పుల ఘటన కారణంగా కొద్దిసేపు వైట్‌హౌస్‌ను మూసేశారు. మీడియా సిబ్బందిని సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పరిసర ప్రాంతాల్లో రోడ్లను మూసివేశారు. ఈ కాల్పుల ఘటన జరగడానికి కొద్దిసేపటికి ముందే ఆ రోడ్డులో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కాన్వాయ్ వెళ్లింది. ఆ కాల్పులు జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారు. కాగా, ఈ దాడి నేరుగా వైట్‌హౌస్‌ను టార్గెట్ చేసింది కాదని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో సీక్రెట్ సర్వీస్ అధికారులు ఒక అనుమానితుడిపై కాల్పులు జరిపారు. గాయపడిన అనుమానితుడిని హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించనున్నారు.
అమెరికా వైట్‍హౌస్ సమీపంలో మరోసారి భద్రతా వైఫల్యం..
83
previous post






Total views : 74954