Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Film Motive for Murder (M4M) movie review …

Motive for Murder (M4M) movie review …

by CVR NEWS
may 8th release

టాలీవుడ్‌లో ‘మల్లెపూవు’, ‘మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ లాంటి స‌క్సెస్‌ఫుల్‌ సినిమాలను నిర్మించి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న‌ మోహన్ వడ్లపట్ల ద‌ర్శ‌కునిగా మారి తీసుకొచ్చిన మూవీ ఎం4ఎం (M4M – Motive For Murder). అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma) ప్రధాన పాత్రలో, మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్స్‌ల్లో 15కి పైగా అవార్డులు అందుకున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో తెలుసుకుందాం.

​కథ:
హైదరాబాద్ నగరాన్ని ఒక భయంకరమైన సీరియల్ కిల్లర్ గజగజలాడిస్తుంటాడు. ఈ హంతకుడు తను చేసే ప్రతి హత్యను ప్రసిద్ధ చిత్రలేఖనాల (Paintings) రూపంలో అలంకరించడం ఈ కథలోని అత్యంత ఆసక్తికరమైన, భయంకరమైన అంశం. ఈ వరుస హత్యల నేపథ్యంలో ఏసీపీ కృష్ణ (సంబీత్ ఆచార్య) ఒక‌వైపు, మ‌రోవైపు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాధ (జో శర్మ) తమ సొంత దర్యాప్తును ప్రారంభిస్తారు. కిల్లర్ పోలీసులను తన వాయిస్ మెసేజ్‌లతో సవాల్ చేస్తుంటే, కృష్ణ, రాధ ఈ హత్యల వెనుక ఉన్న అసలు కారణాన్ని (Motive) ఎలా కనుగొన్నారనేదే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.

విశ్లేషణ:
క్ష‌ణ‌క్ష‌ణం ఉత్కంఠ‌త పెంచుతూ సాగుతుంది ఈ సినిమా. సాధారణ క్రైమ్ థ్రిల్లర్లలా కాకుండా, మృతదేహాలను ప్రసిద్ధ చిత్రలేఖనాలతో పోల్చడం అనేది ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా “Lovers-II” వంటి పెయింటింగ్‌లను హత్యలతో ముడిపెట్టడం ఉత్కంఠను పెంచుతుంది. ఇది ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇందులో ఒక సీరియల్ కిల్లర్ ఉంటాడు. అతను హత్యలు చేసిన తర్వాత, ఆ మృతదేహాలను రాజా రవివర్మ, పికాసో లాంటి పెయింటర్ల ఫేమ‌స్ పెయింటింగ్స్ (కళాఖండాల) తరహాలో డెకరేట్ చేస్తాడు. ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు. ప్రతి సీన్ చాలా గ్రిప్పింగ్‌గా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా సాగుతుంది.

నటీనటుల ప్రదర్శన:
అమెరికన్ నటి జో శర్మ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ రాధ పాత్రలో చ‌క్క‌గా ఒదిగిపోయారు. ఆమె ఈ సినిమాకు మెయిన్ పిల్ల‌ర్‌గా క‌నిపిస్తారు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, డాన్స్.. ఇలా అన్నింటిలోనూ జో శ‌ర్మ జోరు చూపించింద‌నే చెప్పాలి. ఇక హీరో పాత్ర‌లో సంబీత్ ఆచార్య ఏసీపీ కృష్ణగా ఫ‌ర్‌ఫెక్ట్ అనిపించారు. సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్, సత్య కృష్ణ తమ అనుభవంతో పాత్రలకు ప్రాణం పోశారు. ఇత‌ర న‌టీన‌టులు త‌మ పాత్ర‌లకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం:
గతంలో ‘మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయె మదిలో’ వంటి చిత్రాలను అందించిన మోహన్ వడ్లపట్ల, త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వాస్తవిక దృక్పథంతో, తక్కువ సినిమాటిక్ లిబర్టీతో తెరకెక్కించారు. వసంత్ ఇసైపెట్టై అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని సస్పెన్స్‌ను నెక్ట్స్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. ​సినిమాటోగ్రఫీ మ‌రో హైలైట్. సంతోష్ షానమోని రెడ్ వి-రాప్టర్ (Red V-Raptor) కెమెరాను ఉపయోగించి నగరంలోని థ్రిల్లింగ్ వాతావరణాన్ని చక్కగా బంధించారు.

మోహన్ వడ్లపట్ల ఈ సినిమాను యూనిక్ పాయింట్ తో తీశారు. సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌లోనే స‌రికొత్త క‌థ‌నం ఆవిష్క‌రించారు. మర్డర్ల‌ మిస్టరీల‌ను, ఫుల్ ఆఫ్ ట్విస్టులతో కొన‌సాగించారు. అన‌వ‌స‌ర‌మై సీన్లు లేకుండా గ్రిప్పింగ్ సీన్ల‌తో అల‌రించారు.

​హైలైట్స్:
సినిమా చివరలో వచ్చే ట్విస్ట్‌లు, హంతకుడి మోటివ్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. సినిమాకు మ‌రో ప్ల‌స్ పాయింట్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. ఎక్కడా బోర్ కొట్టకుండా కథ వేగంగా సాగుతుంది. వాసుదేవ్ రాసిన ‘M4M’ పుస్త‌కంపై బ్యాన్ విధిస్తారు. ఈ పుస్తకం, హంతకుడికి మధ్య ఉన్న సంబంధం కథలో ఒక కీలక మలుపు. ఇక మూవీ చివ‌ర‌లో Who is the Killer సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. అంత‌వ‌ర‌కు ఉత్కంఠ‌తో ఉన్న ప్రేక్ష‌కుల‌కు ఈ సాంగ్ మంచి జోష్‌ను ఇస్తుంది.

​​సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ చిత్రాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ‘M4M’ మ‌రింతాగా న‌చ్చుతుంది. విలక్షణమైన ప్లాట్ పాయింట్, ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే ఈ సినిమాను ఒక ‘సినిమాటిక్ మాస్టర్ పీస్’గా నిలబెడుతుంది. ఇది గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012474
Total views : 75213

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.