Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Latest News త్రిషకు పార్టీ పదవి లేదా ఉపఎన్నికలో టికెట్ ఇస్తారా..?

త్రిషకు పార్టీ పదవి లేదా ఉపఎన్నికలో టికెట్ ఇస్తారా..?

by CVR NEWS
త్రిషకు పార్టీ పదవి లేదా ఉపఎన్నికలో టికెట్ ఇస్తారా..?

తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది హీరో విజయ్ – హీరోయిన్ త్రిషల సన్నిహిత్యం. రాజకీయాలు, సినిమా, వ్యక్తిగత జీవితం అన్నీ కలిసిపోయిన ఈ చర్చ రోజురోజుకూ మరింత వేడెక్కుతోంది. విజయ్ తొలిసారే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం… ఆ వేడుకకు త్రిష ప్రత్యేకంగా హాజరుకావడం… అభిమానులకు చేతులు ఊపుతూ కనిపించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని పెంచింది. ఎంజీఆర్ – జయలలితల రాజకీయ, సినీ అనుబంధంతో పోలుస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలో “తాను కూడా సీఎం అవుతాను” అని త్రిష చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. విజయ్ కుటుంబంతో త్రిష కలివిడిగా కనిపించడం… వరుసగా కలిసి పబ్లిక్ ఈవెంట్లలో పాల్గొనడం… భవిష్యత్తులో ఆమె రాజకీయాల్లోకి రావచ్చనే ఊహాగానాలకు కారణమవుతోంది. పార్టీ పదవి లేదా ఉపఎన్నిక టికెట్ కూడా ఇవ్వొచ్చనే ప్రచారం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

విజయ్ – త్రిషల సంబంధంపై మొదట బహిరంగంగా వ్యాఖ్యానించి వివాదానికి తెరలేపింది తమిళనాడు బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్. “విజయ్ ముందుగా త్రిష ప్రభావం నుంచి బయటకు రావాలి” అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన త్రిష… వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాల్లోకి లాగడం అసభ్యకరమని మండిపడ్డారు. అయినా ఆ వివాదం అక్కడితో ఆగలేదు. తర్వాత విజయ్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో త్రిష కనిపించడం… ఎన్నికల అనంతరం విజయ్ కుటుంబ సభ్యులతో కూడా సన్నిహితంగా మెలగడం మరోసారి చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో ఇద్దరి ఫొటోలు వైరల్ అవుతుండటంతో అభిమానులు, రాజకీయ విశ్లేషకులు తమ తమ కోణాల్లో అర్థాలు వెతుకుతున్నారు. విజయ్ రాజకీయ భవిష్యత్తులో త్రిష కీలక పాత్ర పోషిస్తుందా? లేక ఇది కేవలం స్నేహమేనా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారాయి.

తాజాగా త్రిష సోషల్ మీడియాలో పెట్టిన ప్రేమపై పోస్ట్ ఇప్పుడు మరింత చర్చకు దారి తీసింది. “ప్రేమ ఎప్పుడూ గొప్పగానే వ్యక్తమవుతుంది” అంటూ నీలిరంగు హార్ట్ ఎమోజీతో చేసిన పోస్ట్ అభిమానుల్లో కొత్త ఊహాగానాలకు కారణమైంది. ఇదే సమయంలో విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో ఆమె భావోద్వేగానికి గురయ్యారనే ప్రచారం కూడా జోరందుకుంది. విజయ్‌తో కలిసి త్రిష నటించిన ఐదు సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఆ సినిమాల సమయంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు అదే స్నేహం రాజకీయ చర్చలకు కేంద్రబిందువవుతోంది. ఎంజీఆర్ – జయలలిత మాదిరిగా విజయ్ – త్రిష జోడీ కూడా తమిళ రాజకీయాల్లో ప్రభావం చూపుతుందా? త్రిష రాజకీయాల్లోకి అధికారికంగా అడుగుపెడతారా? అన్న ప్రశ్నలు రోజురోజుకూ బలపడుతున్నాయి. అయితే ఇవన్నీ ఊహాగానాలేనా? లేక భవిష్యత్తు రాజకీయాలకు సంకేతాలా? అన్నది కాలమే నిర్ణయించాలి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012437
Total views : 75164

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.