Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra Pradesh ఏలూరు జిల్లాలో గాలివాన బీభత్సం..

ఏలూరు జిల్లాలో గాలివాన బీభత్సం..

by CVR NEWS
ఏలూరు జిల్లాలో గాలివాన బీభత్సం

ఏలూరు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. వర్షం ధాటికి ఎక్కడికక్కడ వృక్షాలు, చెట్ల కొమ్మలు విరిగి రహదారులపై పడ్డాయి. దీనితో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. మరోవైపు, చెట్లు విద్యుత్ స్తంభాలపై కూలడంతో తీగలు తెగిపడి.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ అకాల వర్షాలు అన్నదాతలను నిలువునా ముంచేశాయి. జిల్లాలో ఒకపక్క తీవ్రమైన ఎండలు, మరోపక్క అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాల వల్ల.. వాతావరణంలో వచ్చిన మార్పులు ఆక్వా రంగంపై కోలుకోలేని దెబ్బ కొట్టాయి. చెరువుల్లో ఆక్సిజన్ అందక రొయ్యలు ఊపిరాడక మృత్యువాత పడుతున్నాయి. దీంతో లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టిన ఆక్వా రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అటు చేతికొచ్చిన మామిడి కాయలు ఈదురు గాలులకు రాలిపోగా.. వరి, మొక్కజొన్న పంటలు నీటమునిగి పొలాల్లోనే నేలవాలాయి. .దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఏలూరు జిల్లా నుంచి అందిస్తారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012549
Total views : 75358

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.