Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra Pradesh జీవీఎంసీ శానిటరీ విభాగంలో అవినీతి బాగోతం..

జీవీఎంసీ శానిటరీ విభాగంలో అవినీతి బాగోతం..

by CVR NEWS
జీవీఎంసీ శానిటరీ విభాగంలో అవినీతి బాగోతం

విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కొంతమంది అవినీతి అధికారులకు, సిబ్బందికి కామధేనువులా మారింది. గాజువాక జోన్ పరిధిలోని శానిటరీ విభాగంలో కొందరు ఉద్యోగులు విధులకు అస్సలు హాజరు కాకుండానే.. ప్రతి నెలా ప్రభుత్వ జీతాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జోన్ పరిధిలో మొత్తం 19 వార్డులు ఉండగా.. కేవలం 15 మంది మాత్రమే శానిటరీ ఇన్‌స్పెక్టర్లు పనిచేస్తున్నారు. దీనితో మరో నలుగురు అదనపు వార్డులకు ఇన్‌ఛార్జ్‌లుగా వ్యవహరిస్తూ తీవ్ర పనిభారంతో సతమతమవుతున్నారు. మరోవైపు విధులకు రాని సదరు సిబ్బందికి దొంగ హాజరు వేస్తూ.. ఉన్నతాధికారులు ప్రతి నెలా భారీగా మామూళ్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. బయోమెట్రిక్ ఐరిస్ వేయాల్సిన సీక్రెట్ పాస్‌వర్డ్‌ను కూడా శానిటరీ వర్కర్లకే ఇచ్చేయడంతో.. వారు ఇళ్ల వద్ద నుంచే దర్జాగా అటెండెన్స్ వేసేస్తున్నారనే వాదనలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ అక్రమాలపై జీవీఎంసీ కమిషనర్ తక్షణమే స్పందించి, విచారణ జరిపి బాధ్యులపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ విశాఖపట్నం నుండి అందిస్తారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012549
Total views : 75358

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.