Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Devotional హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

by CVR NEWS
హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు

హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. రామనామ స్మరణలతో కొండగట్టు గిరులు మార్మోగుతున్నాయి. పచ్చని కొండ కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా మాలదీక్ష భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని దీక్ష విరమణ చేశారు. తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012397
Total views : 74955

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.