Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Latest News బయట చూస్తే SBI ATM..

బయట చూస్తే SBI ATM..

by CVR NEWS
బయట చూస్తే SBI ATM

బోర్డు చూస్తే ఎస్‌బీఐ ఏటీఎం.. లోపలికి వెళ్తే కటింగ్‌ షాపు..! బీహార్‌లోని పాట్నా సమీపంలో ఉన్న దానాపూర్‌లో వెలుగుచూసిన ఈ విచిత్రమైన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తోంది. దానాపూర్‌లోని ఒక రూమ్‌లో గతంలో ఎస్‌బీఐ ఏటీఎం ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల బ్యాంక్ దాన్ని మూసేసి.. ఆ ఖాళీ స్థలాన్ని వేరొకరికి అద్దెకు ఇచ్చింది. కానీ, బయట ఉన్న ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం’ బోర్డును తీసేయడం బ్యాంకు అధికారులు మర్చిపోయారు. అయితే ఆ స్థలాన్ని అద్దెకు తీసుకున్న వ్యక్తి.. బోర్డు అలాగే ఉంచి, లోపల ఏకంగా అద్దాలు, కుర్చీలు వేసి సెలూన్ షాపు పెట్టేశాడు. దీంతో బయట నుంచి చూసి డబ్బుల కోసం లోపలికి వెళ్లిన జనం.. అక్కడ హెయిర్ కటింగ్ చూసి బిత్తరపోతున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో మీమర్స్ పండగ చేసుకుంటున్నారు. బ్యాంకింగ్ భాషలో లోన్ల మాఫీని లేదా నష్టపోవడాన్ని ‘హెయిర్ కట్’ అంటారని.. ఇప్పుడు ఎస్‌బీఐ ఆ పదానికి లైవ్‌లో సరికొత్త అర్థం చెబుతోందంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

023976
Total views : 143662

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.