గుంటూరు జిల్లా తాడేపల్లిలో మత్స్యకారుల సంబరాలు అంబరాన్ని తాకాయి. కూటమి ప్రభుత్వం మత్స్యకారుల అకౌంట్లలో రూ. 20 వేల ఆర్థిక సాయాన్ని జమ చేయడంపై వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి సమీపంలో.. కృష్ణానదిలో మత్స్యకారులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 100 బోట్లతో నదిలోకి తరలివచ్చి సీఎం నివాసం వైపు చూస్తూ “జల వందనం” సమర్పించారు.మత్స్యకారుల కృతజ్ఞతా కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా హాజరయ్యారు. తాడేపల్లికి తరలివచ్చిన మత్స్యకారులందరికీ మంత్రి లోకేష్ స్వయంగా దగ్గరుండి భోజన వసతి కల్పించారు. అంతేకాకుండా, వారితో కలిసి కూర్చుని భోజనం చేస్తూ.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మత్స్యకారులతో కలిసి లోకేష్ గ్రూప్ ఫోటోలు దిగి వారిలో ఉత్సాహాన్ని నింపారు. తమకు అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, మంత్రి లోకేష్‌కు మత్స్యకారులు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
తాడేపల్లి కృష్ణానదిలో మత్స్యకారుల జల వందనం..
40
previous post




Total views : 81782