Sunday, August 30, 2026
News Navigation
Sunday, August 30, 2026
News Navigation

Breaking

Sunday, August 30, 2026
Home Andhra Pradesh విజయవాడ నకిలీ మద్యం కేసులో చార్జ్ షీట్ దాఖలు..

విజయవాడ నకిలీ మద్యం కేసులో చార్జ్ షీట్ దాఖలు..

by CVR NEWS
విజయవాడ నకిలీ మద్యం కేసులో చార్జ్ షీట్ దాఖలు

నకిలీ మద్యం కేసులో సిట్, ఎక్సైజ్ అధికారులు కీలక ముందడుగు వేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టులో తుది చార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 1,300 పేజీలతో రూపొందించిన ఈ ఛార్జిషీట్‌లో 25 మందిపై అభియోగాలు మోపారు. అలాగే 89 మందిని సాక్షులుగా చేర్చినట్లు సిట్, ఎక్సైజ్ శాఖ అధికారులు వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఏ1 జనార్దన్ రావు నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారాలు నిర్వహించినట్లు సిట్ గుర్తించింది. వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ సహకారంతోనే అతడు ఈ కల్తీ మద్యం తయారు చేసినట్లు ఛార్జిషీట్‌లో సిట్ స్పష్టం చేసింది. అలాగే కల్తీ మద్యం తయారు చేయడం ద్వారా జనార్దన్ రావుతో పాటు జోగి రమేష్ లబ్ది పొందినట్లు అందులో పేర్కొంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పలువురి వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను కోర్టుకు సిట్ సమర్పించింది.

 

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: