Sunday, August 30, 2026
News Navigation
Sunday, August 30, 2026
News Navigation

Breaking

Sunday, August 30, 2026
Home Andhra Pradesh ఆకివీడు రామాలయం వివాదంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్..

ఆకివీడు రామాలయం వివాదంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్..

by CVR NEWS
ఆకివీడు రామాలయం వివాదంపై స్పందించిన డిప్యూటీ స్పీకర్

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు శ్రీరామాలయం నిర్మాణ వివాదంపై డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ నిర్మాణంపై కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. కాళ్ల మండలం పెదఅమిరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడుతూ… కోర్టు స్టే ఇవ్వలేదని, కేవలం యథాతథ స్థితి (స్టేటస్ కో) విధించిందని స్పష్టం చేశారు. ఉండ్లమట్ల జయంతి అనే మహిళ ద్వారా కొందరు కావాలనే పిటిషన్ వేయించారని, దీనిపై కోర్టు సెలవులు ముగిసేలోపు సీనియర్ లాయర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో కేవియట్ వేయకపోవడం పెద్ద పొరపాటని, ఇందుకు రామభక్తులు తనను క్షమించాలని కోరారు. ఇదే సమయంలో తన రాజకీయ, వ్యక్తిగత అంశాలపై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేసిన ఆయన… హిందూ దళితులకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడటం తప్పా అని ప్రశ్నించారు. దళిత క్రైస్తవులకు ఓట్లు ఉన్నట్లే హిందువులకు కూడా ఓట్లు ఉన్నాయని గుర్తు చేశారు. తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నా భయపడే ప్రసక్తే లేదని రఘురామ తేల్చిచెప్పారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: