తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి సంబంధించి ఒక స్పష్టమైన బ్లూప్రింట్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రాల మధ్య సమన్వయంతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడును కలుపుతూ కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ తీసుకురావాలని, అలాగే గోదావరి-కావేరి నదుల అనుసంధానం చేపట్టాలని ఆయన ప్రతిపాదించారు. దీంతో పాటు ఏపీ విభజన హామీలు, దుగ్గరాజుపట్నం పోర్టు, విశాఖ-విజయవాడ మెట్రో తదితర ప్రాజెక్టులకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దక్షిణాది అభివృద్ధి కోసం ఒక సీనియర్ నాయకుడిగా చంద్రబాబు చేసిన ఈ ప్రసంగంపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్తో పాటు పలువురు ముఖ్యమంత్రులు ప్రశంసల జల్లు కురిపించారు.
మహాబలిపురంలో 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం.
51
previous post