తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తున్నారంటూ వస్తున్న ప్రచారంపై మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టత ఇచ్చారు. పాలిటెక్నిక్‌లను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం లేదని… వాటిని మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతూ అప్‌గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు గురికావద్దని సూచించారు.
అదే సమయంలో పాలిటెక్నిక్ విద్యార్థులకు కీలక భరోసా ఇచ్చిన మంత్రి వివేక్… ఈసెట్ ద్వారా బీటెక్‌లో ప్రవేశాల విధానం యథాతథంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులకు బీటెక్‌లో లాటరల్ ఎంట్రీ అవకాశాలు కూడా కొనసాగుతాయని తెలిపారు. స్కిల్ ఆధారిత విద్యకు మరింత ప్రాధాన్యం ఇస్తూనే… పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.