67
హైదరాబాద్‌లో మరో భారీ ప్లాట్ల వేలానికి హెచ్ఎండీఏ సిద్ధమవుతోంది. బాచుపల్లి ప్రాంతంలోని విలువైన రెసిడెన్షియల్ ప్లాట్లను వేలం వేయనున్న నేపథ్యంలో… ఆసక్తిగల కొనుగోలుదారులు, పెట్టుబడిదారులతో హెచ్ఎండీఏ ప్రీ-బిడ్డింగ్ సమావేశం నిర్వహించింది. ఈ వేలం ద్వారా పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
బాచుపల్లిలో మొత్తం 35 రెసిడెన్షియల్ ప్లాట్లను వేలం వేయనున్నారు. ఈ వేలంలో పాల్గొనాలనుకునే వారు ఈ నెల 31వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం సెప్టెంబర్ 2న బాచుపల్లి, మోకిల ప్రాంతాల్లోని ప్లాట్లకు వేలం నిర్వహించనున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఈ వేలంపై కొనుగోలుదారులు, పెట్టుబడిదారుల్లో ఆసక్తి నెలకొంది.