భారత్–పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తత మరోసారి తెరపైకి వచ్చింది. ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్ వెలుపల పాకిస్థాన్ అధికారులు బారికేడ్లు, పార్కింగ్ పోల్స్‌ను తొలగించిన మూడు రోజులకే.. న్యూఢిల్లీలో భారత్ కూడా పాకిస్థాన్‌కు కౌంటర్ ఇచ్చింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన నిర్మాణాలను భారత అధికారులు తొలగించారు. పాక్ వీసా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన క్యూ బారికేడ్లను జేసీబీలతో తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
()ఇస్లామాబాద్‌లో తమ హైకమిషన్ వెలుపల పాక్ చేపట్టిన చర్యలపై భారత్ అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినప్పటికీ పాకిస్థాన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. దీంతో అదే తరహాలో న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్ వద్ద భారత్ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాన్ని కేవలం నిర్మాణాల తొలగింపుగా కాకుండా.. దౌత్యపరమైన పరస్పర ప్రతిచర్యగా చూడాల్సి వస్తోంది.ముఖ్యంగా ఇరుదేశాల దౌత్య కార్యాలయాల వద్ద భద్రత, ప్రవేశ మార్గాలు, అనుమతి లేని నిర్మాణాల విషయంలో తీసుకునే చర్యలు అత్యంత సున్నితమైన అంశాలు. ఒక దేశం తీసుకున్న చర్యకు మరో దేశం అదే స్థాయిలో స్పందించడం.. ఇప్పటికే సున్నితంగా ఉన్న భారత్–పాక్ సంబంధాల్లో మరింత ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది.
()అయితే భారత్ చేపట్టిన చర్యలు అనుమతి లేని నిర్మాణాల తొలగింపునకు సంబంధించినవేనని అధికారికంగా చెబుతున్నప్పటికీ.. సమయాన్ని పరిశీలిస్తే ఇస్లామాబాద్‌లో పాక్ చర్యకు ఇది ప్రతిచర్యగా కనిపిస్తోంది. దీంతో దౌత్యపరమైన అంశాల్లో ఇరుదేశాల మధ్య పరస్పర చర్యలు మరింత కఠినతరం అవుతున్నాయా? అన్న చర్చ మొదలైంది.ఒకవైపు భద్రతా అంశాలు.. మరోవైపు దౌత్య మర్యాదలు.. ఇంకోవైపు ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత.. ఈ మూడు అంశాల మధ్య తాజా పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ చర్యకు పాకిస్థాన్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? తదుపరి దౌత్యపరమైన పరిణామాలు ఎలా ఉంటాయి? అన్నది ఆసక్తికరంగా మారింది.
పాక్ చర్యకు భారత్ కౌంటర్.
50
previous post