భారత మహిళల హాకీ జట్టు ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. పూల్ డి విభాగంలో ఇంగ్లాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌ను భారత్ 0-0తో డ్రాగా ముగించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇంగ్లాండ్ క్రీడాకారిణులు గోల్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించినా.. భారత డిఫెన్స్ అద్భుతంగా అడ్డుకుంది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా భారత ప్లేయర్లు పట్టుదలతో పోరాడారు. చివరి వరకు గోల్ కోసం ఇంగ్లాండ్ చేసిన ప్రయత్నాలను భారత గోల్‌కీపర్‌తో పాటు డిఫెండర్లు సమర్థంగా నిలువరించారు. ఈ డ్రాతో భారత్ ఖాతాలో మొత్తం ఐదు పాయింట్లు చేరాయి. దీంతో పూల్ డి నుంచి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. మరోవైపు నాలుగు పాయింట్లతో ఉన్న ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కీలక మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన భారత జట్టు తదుపరి రౌండ్‌పై దృష్టి సారించింది.
హాకీ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్‌తో భారత్ గోల్ లెస్ డ్రా.
45
previous post