Saturday, August 22, 2026
News Navigation
Saturday, August 22, 2026
News Navigation

Breaking

Saturday, August 22, 2026
Home Latest News తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే వర్సెస్ టీవీకే.

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే వర్సెస్ టీవీకే.

by CVR NEWS

తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్ల కేటాయింపు అంశం రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ విషయంలో అధికార టీవీకే, డీఎంకే సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలకు కార్లు కేటాయించే ముందు వారి ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తుల వివరాలను పరిశీలించాలని డీఎంకే సభ్యులు సూచించారు. ఇప్పటికే సొంతంగా వాహనాలు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత ఉన్నవారికి ప్రభుత్వ కార్లు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు ఉచిత ప్రభుత్వ కార్లు అవసరం లేదని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా టీవీకే సభ్యులు ఉదయనిధి స్టాలిన్‌కు మూడు ఇళ్లు ఉన్నాయని పేర్కొంటూ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ కార్ల అంశంపై ఇరు పార్టీల మధ్య జరిగిన మాటల యుద్ధంతో అసెంబ్లీలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వ్యవహారం ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: