హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారతీయ సిబ్బంది ఉన్న నౌకపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 22న పనామా జెండాతో ప్రయాణిస్తున్న యుఫోరియా నౌకపై ఇరాన్‌కు చెందిన బలగాలు కాల్పులు జరిపినట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. ఈ నౌకలో మొత్తం 22 మంది సిబ్బంది ఉండగా, వారిలో 21 మంది భారతీయులు ఉన్నారు. కాల్పుల ఘటనలో భారతీయ సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని భారత ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 22 మంది భారతీయ నావికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాల్పులు జరుగుతున్న సమయంలో సిబ్బంది ప్రాణాలు కాపాడుకునేందుకు నౌకలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్న దృశ్యాలు తాజాగా విడుదలైన వీడియోలో కనిపించాయి. ఈ ఘటనతో కీలకమైన హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో మరో నౌక ఎపమినోండాస్‌లో ఉన్న ఒక భారతీయ నావికుడు కూడా సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
హార్ముజ్ జలసంధిలో భారతీయులున్న నౌకపై ఇరాన్ కాల్పులు.
63
previous post