Saturday, August 22, 2026
News Navigation
Saturday, August 22, 2026
News Navigation

Breaking

Saturday, August 22, 2026
Home Latest News భక్తుల భద్రత కోసం టీటీడీ సరికొత్త టెక్నాలజీ.

భక్తుల భద్రత కోసం టీటీడీ సరికొత్త టెక్నాలజీ.

by CVR NEWS

తిరుమలలో భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టింది. వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు నాలుగు కాళ్ల రోబోట్ డాగ్‌ను వినియోగించే దిశగా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద రోబోట్ డాగ్ పనితీరును టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి పరిశీలించారు. మనుషులు వెళ్లేందుకు ప్రమాదకరమైన అటవీ ప్రాంతాల్లో చిరుతలు, ఇతర క్రూరమృగాల కదలికలను గుర్తించేందుకు ఈ రోబోట్‌ను వినియోగించనున్నారు. అత్యాధునిక ఆప్టికల్, థర్మల్ కెమెరాలతో పాటు 360 డిగ్రీల లైడార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇందులో ఉన్నాయి. చీకటి, పొగమంచులోనూ జంతువులను గుర్తించి కంట్రోల్ రూమ్‌కు లైవ్ వీడియో, జియో ట్యాగ్ అలర్ట్‌లు పంపనుంది. కాలిబాటల వైపు వన్యప్రాణులు వస్తే సౌండ్, లైట్‌ల ద్వారా వాటిని అడవిలోకి మళ్లించేలా రోబోట్‌ను రూపొందించారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: