Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Andhra Pradesh అల్లూరి జిల్లాలో పంచాయతీ నిధుల గోల్‌మాల్ ఆరోపణలు..

అల్లూరి జిల్లాలో పంచాయతీ నిధుల గోల్‌మాల్ ఆరోపణలు..

by CVR NEWS
అల్లూరి జిల్లాలో పంచాయతీ నిధుల గోల్‌మాల్ ఆరోపణలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. కొయ్యూరు మండలం బూదరాల పంచాయతీలో 80 లక్షల రూపాయల నిధులు గోల్మాల్ అయినట్లు స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే నిధులను దుర్వినియోగం చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలో కేవలం రెండు చోట్ల రచ్చబండలు, ఒక చోట సీసీ రోడ్డు తప్ప మరెక్కడా పనులు జరిగినట్లు కనిపించడం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే ఎం-బుక్‌లో మాత్రం శానిటైజేషన్, వీధిలైట్లు, రోడ్లు, వాటర్ రిపేర్లు, జంగిల్ క్లియరెన్స్ వంటి పనులు చేసినట్లు నమోదు చేసి 80 లక్షలు రూపాయలు డ్రా చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012433
Total views : 75120

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.