పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త వాతావరణమేర్పడింది. UAEకి చెందిన ఫుజైరా చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడులకు దిగింది ఇరాన్. ఈ భీకర దాడిలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గల్ఫ్‌పై ఆధిపత్యం కోసం ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య గత కొంతకాలంగా ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాకు కీలకమైన ఫుజైరా పోర్ట్ సమీపంలోని రిఫైనరీని ఇరాన్ టార్గెట్ చేసుకుంది. బాంబు దాడుల ధాటికి రిఫైనరీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధుల్లో ఉన్న ముగ్గురు భారతీయ కార్మికులు మంటల్లో చిక్కుకుకున్నారు. ఈ ఘటనలో గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ప్రపంచ చమురు రవాణాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ గతంలోనే హెచ్చరించింది. తాజా దాడులతో గల్ఫ్ దేశాల్లో యుద్ధ భయం నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. యూఏఈ కూడా తమ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తోంది. ప్రస్తుతం ఈ దాడుల ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్‌పై పడే అవకాశం ఉంది.





Total views : 75053