Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Latest News విరుగంబాక్కం నుంచి గెలుపొందిన విజయ్ డ్రైవర్ కుమారుడు..

విరుగంబాక్కం నుంచి గెలుపొందిన విజయ్ డ్రైవర్ కుమారుడు..

by CVR NEWS
విరుగంబాక్కం నుంచి గెలుపొందిన విజయ్ డ్రైవర్ కుమారుడు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ జయకేతనం ఎగరవేసింది. 108 స్థానాలను కైవసం చేసుకొని అతి పెద్ద పార్టీగా అవతరించింది. విజయ్‌ పోటీ చేసిన రెండుచోట్లా భారీ మెజార్టీతో గెలిచాడు. ఇక
విజయ్‌కి చాలాకాలంగా డ్రైవర్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న రాజేంద్రన్ కుమారుడు ఆర్.శబరినాథన్ విరుగంబాక్కం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సమీప డీఎంకే అభ్యర్థి ప్రభాకరరాజాపై 27వేల 86 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. శబరినాథన్‌కు 76 వేల 92 ఓట్లు రాగా, ప్రభాకరరాజాకు 49 వేల 6 ఓట్లు వచ్చాయి. ఈ గెలుపుతో తాను చాలా సంతోషంగా ఉన్నానని..తనకు టిక్కెట్ ఇచ్చి గెలుపుకు కృషి చేసిన విజయ్‌కు ఎప్పటికీ కృతజ్ఞుడిగా ఉంటానన్నారు శబరినాథన్‌. విజయ్ రాష్ట్రంలో డీఎంకే పాలనకు ముగింపు పలికారన్నారు.

ఆర్.శబరినాథన్ తండ్రి రాజేంద్రన్.. సుదీర్ఘకాలంగా విజయ్ డ్రైవర్‌గా, వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్నారు. విజయ్ తొలి చిత్రం ‘నాలైయ తీర్పు’ నుంచి, దాదాపు 35 ఏళ్లుగా ఆయన దగ్గర పనిచేస్తున్నారు. ఇక విరుగంబాక్కం నియోజకవర్గంలో 2011లో డీఎండీకే, 2016లో అన్నాడీఎంకే, 2021లో డీఎంకే విజయం సాధించగా, ఇప్పుడు టీవీకే విజయం సాధించింది.

Advertisements

You may also like

Our Visitor

039879
Total views : 201211

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: