Thursday, May 14, 2026
News Navigation
Thursday, May 14, 2026
News Navigation

Breaking

Thursday, May 14, 2026
Home Andhra Pradesh ఇండియా కప్ గెలవాలని ప్రత్యేక పూజలు చేసిన అభిమానులు

ఇండియా కప్ గెలవాలని ప్రత్యేక పూజలు చేసిన అభిమానులు

by Satya
Worshipful fans

గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగబోతుంది. దేశం మొత్తం క్రికెట్‌ ఫివర్‌తో ఊగిపోతోంది. ఎటుచూసినా టీమిండియా గెలవాలన్న నినాదామే వినిపిస్తోంది. టీమిండియాకు ఎదురులేదని అభిమానులు ఢంకా బజాయించి మరీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే భారత్ జట్టు గెలవాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని దత్తసాయి ఆలయంలో క్రికెట్ అభిమానులు పూజలు చేశారు. జాతీయ జెండాలు చేత పట్టి ఇండియా జట్టుకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పూజలు, హోమాలు, యాగాలు చేస్తూ టీమ్ ఇండియా ఫైనల్లోకి ప్రవేశించడంతో ఈసారి కప్పు రావడం ఖాయమని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

012570
Total views : 75422

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.