Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Latest News సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ..

సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ..

by CVR NEWS
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన హిమంత బిశ్వశర్మ

హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారంతో అసోం రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. గౌహతిలోని ఖానాపరాలో జరిగిన వేడుకలో హిమంత బిశ్వ శర్మ అసోం ముఖ్యమంత్రిగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించారు. బిశ్వ శర్మతో పాటు రామేశ్వర్ తేలి, అతుల్ బోరా, చరణ్ బోరో, అజంతా నియోగ్ వంటి కీలక నేతలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ నేత రంజిత్ దాస్‌ను అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఇక ప్రమాణస్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, చంద్రబాబు సహా ఎన్డీయే కూటమికి చెందిన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఈ వేడుకలో పాల్గొని హిమంత బిశ్వ శర్మకు అభినందనలు తెలిపారు. 126 స్థానాలున్న అసోం అసెంబ్లీలో ఎన్డీయే కూటమి 102 స్థానాల భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ విజయోత్సవ సభ అసోం అభివృద్ధిలో కొత్త శకానికి నాంది పలికిందని నేతలు కొనియాడారు.

Advertisements

You may also like

Our Visitor

023978
Total views : 143664

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.