Tuesday, June 16, 2026
News Navigation
Tuesday, June 16, 2026
News Navigation

Breaking

Tuesday, June 16, 2026
Home Latest News నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కలకలం.

నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కలకలం.

by CVR NEWS
నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ కలకలం

నీట్‌ యూజీ-2026 కి సంబంధించి ప్రశ్నాపత్రం లీక్‌ అయినట్లు వస్తున్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. పరీక్షకు ముందు రాజస్థాన్‌లో కోచింగ్‌ సంస్థలు పంపిణీ చేసిన మెటీరియల్‌తో ప్రశ్నా పత్రంలోని 600 మార్కుల ప్రశ్నలు పోలి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిలో పలు రాష్ట్రాల నెట్‌వర్క్‌ల హస్తం ఉందంటూ వస్తున్న ఆరోపణలపై రాజస్థాన్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూపు దర్యాప్తు చేపట్టింది. లీకేజీ వార్తలను నీట్‌ నిర్వహించిన జాతీయ పరీక్ష సంస్థ కూడా కొట్టిపారేయకపోవటం గమనార్హం. ఈ నెల 3న జరిగిన పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన సుమారు 120కి పైగా ప్రశ్నలతో ఉన్న ఓ ప్రాక్టీసు పేపరును గుర్తించినట్లు రాజస్థాన్‌ అదనపు డీజీపీ విశాల్‌ బన్సాల్, ఎస్‌ఓజీ అధికారులు వెల్లడించారు. ఈ మెటీరియల్‌ రాజస్థాన్‌లోని సికార్‌లో పరీక్షకు 42 గంటల ముందు వాట్సాప్‌లో అందుబాటులోకి వచ్చినట్లు నిర్ధారించారు. దీనిని విద్యార్థులకు రూ.20వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించారని, కొందరు అభ్యర్థుల నుంచి ముందుగానే రూ.30 వేలకు పైగా వసూలు చేశారని గుర్తించామన్నారు. ఈ ప్రశ్నలు యాదృచ్ఛికంగా ఒకే మాదిరిగా ఉన్నాయా? లేక ఎవరైనా పేపర్‌ లీక్‌ చేశారా? అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ప్రశ్నల్లోని జవాబుల క్రమం కూడా ఒకేలా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆ ప్రాక్టీసు పేపరు కేరళలోని ఓ వైద్య కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్‌ విద్యార్థికి చెందినదిగా దర్యాప్తులో వెల్లడైంది. ఆ వ్యక్తి ఈ నెల 1న సికార్‌లోని తన స్నేహితుడికి ఈ మెటీరియల్‌ ఇచ్చాడని.. ఆ తర్వాత అది పీజీ వసతిగృహాలు, కోచింగ్‌ నెట్‌వర్క్‌లు, కెరీర్‌ కౌన్సిలర్లు, పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు చేరిందని అధికారులు తెలిపారు. ఆ మెటీరియల్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన 300కు పైగా చేతిరాత ప్రశ్నలు ఉన్నాయని వెల్లడించారు.

Advertisements

You may also like

Our Visitor

023976
Total views : 143662

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.