Wednesday, May 20, 2026
News Navigation
Wednesday, May 20, 2026
News Navigation

Breaking

Wednesday, May 20, 2026
Home National వరుస పేలుళ్లతో దద్దరిల్లిన పంజాబ్‌…

వరుస పేలుళ్లతో దద్దరిల్లిన పంజాబ్‌…

by CVR NEWS
వరుస పేలుళ్లతో దద్దరిల్లిన పంజాబ్‌

వరుస పేలుళ్లతో పంజాబ్‌ దద్దరిల్లింది. రెండు గంటల్లో 2 చోట్ల పేలుళ్లు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. రాత్రి జలంధర్‌లోని బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ BSF ప్రధాన కార్యాలయం సమీపంలో పేలుడు జరిగింది. కార్యాలయం బయట పార్క్‌ చేసి ఉన్న యాక్టివ్‌ పేలడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలు వాహనాలు దెబ్బతిన్నాయి. కిలోమీటరు వరకు పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. ఈ పేలుడులో ఏదైనా కుట్రకోణం ఉందా అనే దానిపైనా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే అమృత్‌సర్‌లో మరో పేలుడు జరిగింది. అటారీ రోడ్డులోని ఆర్మీ ఖాసా కంటోన్మెంట్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో రేకును పోలిన శకలాలు దొరికాయని..దీంతో ఎవరో పేలుడు పరికరాన్ని విసరడం వల్లే ఈ పేలుడు జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు మాస్కులు ధరించి, దాడి చేసి, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది. ఈ రెండు ఘటనలకు ఏదైనా సంబంధం ఉందా అనేదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు ఘటనలూ ఆర్మీ యూనిట్‌లకు సమీపంలోనే జరగడం మరింత ఆందోళనలను రేకెత్తిస్తోంది.

Advertisements

You may also like

Our Visitor

014995
Total views : 81448

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.