జాతీయ స్థాయిలో సత్తా చాటి ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతున్న పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లాలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మురద్నగర్కు చెందిన ఈ యువ అథ్లెట్, గాజియాబాద్లోని ‘సాయి ఉప్వాన్’ ప్రాంతంలో మృతి చెందాడు. చిరాగ్ శరీరంపై ఒంటిపై తీవ్ర గాయాలను బట్టి హత్యగా నిర్దారిస్తున్నారు పోలీసులు. అయితే పోస్టుమార్టం నివేదిక వస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఇప్పటికే ఓ అనుమానితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటు సమాచారం. అయితే బెంగళూరు వేదికగా కేవలం రెండు రోజుల క్రితమే జరిగిన నేషనల్ ఛాంపియన్షిప్లో చిరాగ్ అద్భుతంగా రాణించి, 400 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించాడు. అంతేకాదు జపాన్లో జరగబోయే ప్రతిష్టాత్మక ‘పారా ఆసియా గేమ్స్’ (Para Asian Games) పోటీలకు కూడా అర్హత సాధించాడు. కాగా కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మైలురాయిని అందుకున్న రెండు రోజుల్లోనే ఇలా శవంగా తేలడం క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
Tag:




Total views : 89959