పరేడ్ గ్రౌండ్ సాక్షిగా.. కాంగ్రెస్ సర్కార్‌పై విరుచుకుపడ్డారు కేంద్రమంత్రి బండి సంజయ్. ‘జై శ్రీరామ్’ అంటే కడుపు నిండుతుందా అని హేళన చేసేవారికి.. అదే నినాదంతో బెంగాల్లో వచ్చిన మార్పును గుర్తు చేశారు. మేం సనాతన ధర్మం కోసం పనిచేసేవాళ్లం.. మా ధర్మాన్ని టచ్ చేస్తే ఊరుకోబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ముఖ్యంగా రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ధాన్యం కొనుగోలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తను అయినందుకు నేను ఎంతగానో గర్వపడుతున్నాను. పార్టీ తల వంచుకునే పని నేను ఎప్పుడూ చేయలేదు. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. బెదిరింపులకు భయపడటానికి నేనేమీ ఫామ్‌హౌస్‌లో దాక్కునే ఎలుకను కాదు.. గర్జించే సింహాన్ని అంటూ తన మార్క్ స్పీచ్‌తో హోరెత్తించారు కేంద్రమంత్రి బండి సంజయ్.
Tag:





Total views : 75123