గత ప్రభుత్వం ఏదైనా మంచి పథకాలు చేపడితే..కొనసాగిస్తూ ముందుకు పోతామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బేషిజానికి తావు ఇవ్వకుండా రాష్ట్రప్రయోజనాలే ధ్యేయంగా ముందుకు సాగాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారన్నారు. మా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని బీఆర్ఎస్ అడ్డుకుంటూ పాలిటిక్స్ చేయాలని బీఆర్ఎస్ యత్నిస్తోందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. తాము తిరిగిన అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. హరీశ్ రావు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా వద్దా? హరీశ్ రావు చెప్పాలన్నారు. యువతకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే బీఆర్ఎస్ మాత్రం అడ్డుకోవాలని చూస్తోందన్నారు. జంట నగరాలకు సంబంధించిన మెట్రోను విస్తరణను, శంషాబాద్ కు మెట్రో విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. మా ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే బీఆర్ఎస్ నేతలు విమర్శలతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.ప్రభుత్వంలో ఉండగా పదేళ్లు యువతకు నష్టం చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా నష్టం చేస్తామంటే ప్రజలు సహించరన్నారు.
Tag:





Total views : 89224