బీజేపీ అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు మూడురోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈరోజు సాయంత్రం కరీంనగర్ విచ్చేశారు. ఈ సందర్భంగా దారి మధ్యలో రేణిగుంట టోల్ గేట్ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద పోలీసులు బండి సంజయ్ వాహనాన్ని ఆపారు. విస్త్రత తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ వారికి సహకరించారు.
Bjp
బీజేపీ మూడో లిస్ట్ ను విడుదల చేయడంతో కాంగ్రెస్ విడుదల చేసే మూడో జాబితాపై అందరి దృష్టి పడింది. ఇప్పటి వరకు రెండు జాబితాలను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇవాళ అభ్యర్థుల మూడో జాబితాను ప్రకటించనుంది. వామపక్షాల సీట్ల సర్దుబాటు, మరికొన్ని స్థానాల అభ్యర్థుల మార్పు విషయంపై హస్తం పార్టీ తర్జనభర్జనలు పడుతోంది. రెండో జాబితా ప్రకటన తర్వాత పార్టీలో చెలరేగిన అసమ్మతి సెగను దృష్టిలో ఉంచుకుని మూడో జాబితాపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తు చేసింది
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ థర్డ్ లిస్ట్‌ను కాసేపటి క్రితం ప్రకటించింది. మొత్తం 35 మంది అభ్యర్థులకు ఈ లిస్టులో చోటు దక్కింది. అయితే ఈ లిస్టులో బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన అంబర్ పేట సెగ్మెంట్లో కృష్ణా యాదవ్‌కు చోటు దక్కింది. ఇక బీజేపీ ముఖ్య నేతలు విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డా. లక్ష్మణ్, ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు థర్డ్ లిస్ట్ లో చోటు దక్కలేదు. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు మూడో జాబితాలో చోటు దక్కలేదు. తొలి రెండు జాబితాల్లో 53 మంది, థర్డ్ లిస్ట్ లో 35 మంది కలిపి మొత్తం 88 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించినట్లయింది.
కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇప్పటికే బీజేపీ 53 మందితో రెండు లిస్ట్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక తాజా జాబితాలో40కి పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలిసింది. ఇందులో నిన్న చేరిన వారిలో ఇద్దరికి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో జనసేనకు 9 నుంచి 11సీట్లు కేటాయించే అవకాశం ఉంది. జనసేనతో పొత్తు దృష్టిలో ఉంచుకుని మరికొన్ని స్థానాలను పెండింగ్‌లో ఉంచనుంది. కాసేపట్లో అభ్యర్థుల జాబితా విడుదల కానుండటంతో బీజేపీ టికెట్ ఆవావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లిస్టులో తమ పేరు ఉంటుందో లేదో అని ఆశావహుల్లో సస్పెన్స్ నెలకొంది.
అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు డీకే అరుణ బుధవారం ప్రకటించారు. తాను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. తన గద్వాల నియోజకవర్గంలో బీసీ అభ్యర్థికి అవకాశం ఇస్తామని చెప్పారు. తమ పార్టీ బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు సాగుతోందని, అందుకే తన స్థానంలో బీసీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. గద్వాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తాను గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. తాను తమ పార్టీ అభ్యర్థుల తరఫున తెలంగాణవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తానన్నారు. కాగా, ఇప్పటికే కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ పోటీకి దూరంగా ఉన్నారు.
తెలంగాణలో జనసేన-బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. 12 నియోజకవర్గాలలో జనసేన పొటీ చేయనున్నది. 9 నియోజకవర్గాలపై అవగాహన కుదిరింది. మరో 3 నియోజకవర్గాలపై చర్చలు జరుగుతున్నాయి. జనసేనకు కూకట్ పల్లి ,శేరిలింగంపల్లి , వైరా, ఖమ్మం, అశ్వరావుపేట , కొత్తగూడెం, కోదాడ,నాగర్ కర్నూల్ , తాండూర్ నియోజకవర్గాలను బీజేపీ కేటాయించింది.
కామారెడ్డి నియోజకవర్గంపైనే రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. బిక్కనూరు సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని చర్చ జరుగుతోందన్నిరు. కామారెడ్డి రైతుల కలలు నెరవేర్చడానికే కేసీఆర్ పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈనెల 9న ఆయన నామినేషన్ వేయబోతున్నారన్నారు. నామినేషన్ రోజు వచ్చే ప్రజలను చూసి ఇతర పార్టీల వాళ్లు పోటీ చేసేందుకే భయపడాలి. బీజేపీ ఇచ్చే చాక్లెట్లకు ఆశ పడొద్దు.. బీఆర్ఎస్ ఇచ్చే బిర్యానీ తినండి అని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ కొడంగల్ వచ్చి పోటీ చేయకుంటే తానే కామారెడ్డికి వస్తానని రేవంత్ సవాల్ చేశారన్నారు. ఆయన తీరు చూస్తుంటే తెగబలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడ కొట్టినట్లుగా ఉందన్నారు. పోచమ్మ గుడి ముందు పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్లే అన్నారు. ఉద్యమాల గడ్డ కామారెడ్డిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్‌పై సవాల్ చేయడం అంటే అది మంచి పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ కు 55 ఏళ్లు అవకాశం ఇస్తే ఎందుకు కరెంటు, నీళ్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. సభలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి పార్టీ కండువాలు కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా విమర్శించారు. ‘సంస్థాగతంగా బీజేపీని ఫణంగా పెట్టి మీ సామాజికవర్గ కుటుంబ పార్టీ అయిన టీడీపీ బలోపేతం కోసం తపిస్తున్నావని ఢిల్లీ పెద్దలకూ తెలుసులేమ్మా పురందేశ్వరి. ఇసుకను గతంలో దోచుకునేవారు. ఇప్పుడు సహజవనరుల దోపిడీ తగ్గి ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తోందని తెలుసుకోమ్మా. గాలి బుడగలా ఎగురుతూ, ఇష్టానుసారం మాట్లాడుతున్నావే చెల్లెమ్మా!’ అని ట్వీట్ చేశారు.
ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కొల్లాపూర్‌లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో రాహుల్ మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపిస్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ.15వేలు అందిస్తామన్నారు. ఉపాధి హామీ కూలీలకు కూడా రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. దిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉన్నా.. ప్రియాంక అనారోగ్యం దృష్ట్యా నేను ఈ పర్యటనకు వచ్చానన్నారు. ఓవైపు సీఎం కుటుంబం.. మరోవైపు తెలంగాణ సమాజం.. నిరుద్యోగులు, మహిళలున్నారన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు తదితరులు సభలో పాల్గొన్నారు.
మల్కాజ్గిరి నియోజకవర్గం అల్వాల్ లోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కల్వకుంట్ల కన్నారావు హాజరయ్యారు. తెలంగాణ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఐటి శాఖ మంత్రి కేటీఆర్ వల్లనే అని రాజశేఖర్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో దళిత బంధు, బీసీ బందు, కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ లాంటి ఎన్నో పథకాలని పేద ప్రజల కోసం అందించిన కెసిఆర్ ప్రభుత్వానికి మళ్లీ ఓటు వేసి గెలిపించాలని రాజశేఖర్ రెడ్డి కోరారు.





Total views : 90017