ఏపీలో టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన ఓ సీఐడీ కానిస్టేబుల్ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు నోటీసు అందించారు. టీడీపీ బ్యాంకు ఖాతాల వివరాలు అందజేయాలంటూ సీఐడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 18 లోగా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాల వివరాలు అందజేయాలని సీఐడీ తన నోటీసుల్లో తెలిపింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ… అందులో భాగంగానే టీడీపీ కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
Tag:
CID Notices
జడ్జిలను తిట్టారన్న ఆరోపణలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులను దూషించినట్టు బుద్దా వెంకన్నపై అభియోగాలు ఉన్నాయని, ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ అధికారులు వెల్లడించారు. అభియోగాలపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసినట్టు తెలిపారు. కాగా, బుద్దా వెంకన్న వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం హైదరాబాదులో ఉండగా, సీఐడీ అధికారులు హైదరాబాదుకు వెళ్లి మరీ నేరుగా బుద్దాకు నోటీసులు అందించారు.





Total views : 75285