శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం లో టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు మనస్థాపంతో హఠాన్మరణం చెందిన పుట్టపర్తి మండలం గాజులపల్లికి చెందిన బావయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. అధైర్య పడద్దండి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని బావయ్య కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారి కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాబాయి కుటుంబ సభ్యులకు మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. అక్కడ నుంచి ఓబుల దేవర చెరువు మండలం గాజుకుంటపల్లికి చేరుకున్నారు. టిడిపి కార్యకర్త మేకల రామచంద్ర ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రామచంద్ర కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అనంతరం పార్టీ తరఫున రామచంద్ర కుటుంబ సభ్యులకు మూడు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. భవిష్యత్తులోనూ పార్టీ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. భువనేశ్వరి వెంట మాజీమంత్రులు పరిటాల సునీత పల్లె రఘునాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ పాల్గొన్నారు. Read Also..
nara bhuvaneswari
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడి సతీమణి నారా భువనేశ్వరి పర్యటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు సమయంలో మరణించిన కుటుంబాలను పరామర్శించారు. నిజం గెలవాలి అనే పేరుతో చేస్తున్న యాత్రలో భాగంగా దర్శి పట్టణంలోని 5వ వార్డులో మరణించిన తురిమెల్ల పరిశుద్దరావు కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు అనంతరం మూడు లక్షల రూపాయిల చెక్కును అందించారు. అక్కడ నుండి ముండ్లమూరు మండలం సింగన్నపాలెం గ్రామంలో మరణించిన బత్తిని హనుమంత రావు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయాన్నిఅందించారు. అక్కడ నుండి తాళ్లూరు మండలం గుంటిగంగ దేవాలయం వద్ద గల తేజా వృద్ధాశ్రమం నందు జంపాల నరసింహ రావు కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించారు. భువనేశ్వరి వెంట టీడీపీ జిల్లా నాయకులు ఉన్నారు.
అయినవిల్లి మండలం ఎస్.మూలపాలెం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. చంద్రబాబు నాయుడు అరెస్టు ను టీవీ లో వీక్షించి ఒక్క సారిగా కుప్పకూలి మృతి చెందిన ఎస్.మూలపాలెం గ్రామ ఉపసర్పంచ్ మోరంపూడి మీరా సాహెబ్ కుటుంబాన్ని పరామర్శించి మూడు లక్షల రూపాయల చెక్ ను నారా భువనేశ్వరి అందజేశారు. అనంతరం కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ఉప్పలగుప్తం మండలం చల్లపల్లి బయలుదేరారు.




Total views : 54876