హైకోర్టు (High Court) :
రాష్ట్ర హైకోర్టు (High Court) నూతన భవనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఈ రోజు శంకుస్థాపన చేయనున్నారు. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వ విద్యాలయానికి చెందిన 100 ఎకరాల విస్తీర్ణంలో కొత్త హైకోర్టును నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటన చేశారు. రాష్ట్ర మంత్రివర్గం కూడా ఇందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
లోక్సభ ఎలక్షన్ కోడ్ కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావడం లేదు. సుప్రీంకోర్టు సీజే డీవై చంద్రచూడ్ సహా పలువురు సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరథే, న్యాయమూర్తులు సాయంత్రం 5.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్, బార్ అసోసియేషన్, హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా అటెండ్ అవుతున్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి




Total views : 54700