ప్రపంచంలో ఎప్పుడు ఎన్నో వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయి .ఇది జరుగుతుంది ..ఇది జరగదు అని ఇతి మిద్దంగా ఎవరు ఏమి చెప్పలేరు .ఇక రాజకీయాల్లో అయితే ఇలాంటి వింతలు విశేషాలు చాలా జరుగుతాయి .అతి సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.బాగా పేరున్న నేతలు సైతం ఓటమి బాట పట్టిన సందర్భాలు ఉన్నాయి .తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ , తమిళనాడు ఎన్నికల్లో సరిగ్గా ఇలాంటి సంఘటనలే చోటుచేసుకున్నాయి .ఒక పని మనిషి , ఒక కారు డ్రైవర్ కుమారుడు ఎమ్మెల్యే లుగా ఎన్నికై సామాన్యులు సైతం గెలుపు గుర్రాలు ఎక్కవచ్చని నిరూపించారు .
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక సాధారణ మహిళ సాధించిన అసాధారణ విజయగాథ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీజేపీ తరఫున పోటీ చేసిన కలితా మాఝి ఔగ్రామ్ నియోజకవర్గంలో 12,535 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఒకప్పుడు ఇళ్లల్లో పనిమనిషిగా పనిచేసి నెలకు కేవలం రూ.2,500 సంపాదించిన ఆమె, నేడు ఎమ్మెల్యేగా ఎదగడం ప్రజాస్వామ్య ఉన్న ఔనత్యాన్ని చాటుతుందని చెప్పొచ్చు . 2021లో కూడా ఆమె బీజేపీ తరుపున ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు .అప్పుడు ఎదురైన ఓటమితో ఆమె వెనుకడుగు వేయకుండా ఒక గుణ పాఠంగా తీసుకుని, ప్రజలతో మరింత మమేకమయ్యారు.ఆమె ఉండే గుస్కారా మున్సిపాలిటీ ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవడంలో ఆమె విజయం సాధించారు. పార్టీ ఇచ్చిన మరో అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఈసారి ఘనవిజయం సాధించారు . డబ్బు, ప్రభావం కాకుండా నిజాయితీ, కష్టపడే తత్వం , ప్రజలతో అనుబంధం ఉంటే సాధారణ వ్యక్తి కూడా రాజకీయాల్లో విజయాన్ని అందుకోవచ్చని మాఝి నిరూపించారు. ఆమె గెలుపు మహిళలకు, సాధారణ వర్గాల వారికి ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తోంది.
ఇదే క్రమంలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక సామాన్యుడు విజయం సాధించారు .తమిళ నాట నటుడు కమ్ పొలిటిషియన్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం – టీవీకే సంచలనం నమోదు చేసింది. ఇందులో మరో సంచలనం ఏంటంటే ఆయన దగ్గర సుదీర్ఘ కాలంపాటు డ్రైవర్గా పనిచేసిన రాజేంద్రన్ కుమారుడు శబరినాథన్ విజయం. టీవీకే పార్టీ తరఫున ఆర్. శబరినాథన్ విరుగంబాక్కమ్ నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. సుమారు 27 వేలకు పైగా ఓట్ల తేడాతో డీఎంకే అభ్యర్థి ఎ.ఎం.వి. ప్రభాకర రాజాపై గెలుపొందారు. ప్రభాకర రాజా డీఎంకే తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయ్ తన పార్టీ తరఫున తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను మార్చి 29న చెన్నైలో ప్రకటించారు. ఈ సందర్భంగా విరుగంబాక్కం నియోజకవర్గం నుంచి ఆర్.శబరినాథన్ పోటీ చేస్తారని ప్రకటించారు విజయ్. టికెట్ ప్రకటన తర్వాత విజయ్ కాళ్లకు శబరీనాథ్ నమస్కరించడం, తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటుండగా, ఆయన్ని విజయ్ హత్తుకుని ఓదార్చడం… ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్గా మారాయి. విజయ్ వద్ద సుదీర్ఘకాలం డ్రైవర్గా , వ్యక్తిగత సహాయకుడిగా సుదీర్ఘ కాలం పనిచేసారు శబరినాథన్ తండ్రి రాజేంద్రన్.. విజయ్ లీడ్ రోల్లో నటించిన మొదటి సినిమా నాలైయ తీర్పు నుంచి ఆయనతోనే ఉన్నారు .





Total views : 75033