తెలంగాణ మహిళా కమిషన్ చైర్మెన్‌గా గద్వాల విజయ లక్ష్మీ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్‌తో పాటు ఆరుగురు కమిషన్ సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. వీరంతా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారని జీవోలో స్పష్టం చేసింది ప్రభుత్వం. సభ్యులుగా శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనవరాలు చిట్యాల శ్వేత ఉన్నారు. వీరితో పాటు శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, రాధాబాయి, ఉజ్మా షకీరా సభ్యులుగా ఉన్నారు.
Tag:





Total views : 75006