హైదరాబాద్ ఆమీర్ పేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు… సనత్ నగర్ నియోజకవర్గ BRS MLA అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమాన్ని మంగళ హారతులు పట్టి, నుదుటన తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు పలువురు మహిళలు. చరిత్రలో ఎవరు ఊహించని స్థాయిలో అభివృద్ధి పనులు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగాయన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి పనులు 10 సంవత్సరాలలో చేశామన్నారు. ప్రజలు చూపిస్తున్న ప్రేమ, ఆదరాభిమానాలు ఎప్పటికీ మరురవలేనన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీ సాధించే మొదటి ఐదుగురిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఉండాలని నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.
Telangana
ఎప్పట్లాగే ఈసారీ బాలాపూర్ లడ్డూ వేలం అత్యంత ఆకర్షణగా నిలిచింది. అత్యధిక ధర కూడా పలికింది. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి 27 లక్షల రూపాయలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులతోపాటు మొత్తం 36 మంది పాల్గొన్నా. బాలాపూర్ ఉత్సవ సమితి 1,116 రూపాయలతో వేలం పాట మొదలుపెట్టింది. వేలంపాటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిసహా పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వేలం పూర్తి కాగానే బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభించారు. ప్రత్యేక వాహనంలో విఘ్నేశ్వరుడిని హుస్సేన్ సాగర్‌కు తరలించారు. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, షాలిబండ, ఫలక్‌నుమా, చార్మినార్ మీదుగా హుస్సేన్‌సాగర్ వైపు సాగింది.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్ పల్లి పోలీసుల ఆధ్వర్యంలో.. అక్టోబర్ 21 పొలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానాం చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాజేంద్రనగర్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి, నార్సింగ్ ఏసిపి లక్ష్మీనారాయణ, శంకర్పల్లి సిఐ, ఎస్సై, పోలీస్ బృందం పాల్గొన్నారు. రక్తదానం చేసిన యువకులకు ఏసీపీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.
హైదరాబాదులో ఈ ఉదయం నిమజ్జనానికి బయల్దేరిన ఖైరతాబాద్ శ్రీ దశ మహా విద్యా గణపతి హుస్సేన్ సాగర్ వద్ద గంగమ్మ ఒడికి చేరాడు. ఇక్కడి ఎన్టీఆర్ మార్గ్ లోని క్రేన్ నెం.4 వద్ద ఖైరతాబాద్ గణేశుడిని నిమజ్జనం చేశారు. గణపతి బప్పా మోరియా నినాదాలతో మహా వినాయకుడికి భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఖైరతాబాద్ విఘ్ననాథుడి శోభా యాత్ర టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంది. ఈ శోభా యాత్ర కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. క్రేన్ నెం.4 వద్ద చివరి పూజలు నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసులో నిందితుడు శివరాం రాథోడ్ నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక హైదరాబాద్ చిక్కడపల్లిలోని హాస్టల్ గదిలో ఈ నెల 13న బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై విద్యార్థులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆందోళనలకు దిగారు. గ్రూప్స్ పరీక్షల వాయిదా కారణంగా మానసిక ఒత్తిడితో ఆమె చనిపోయిందంటూ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. శివరాం రాథోడ్ వ్యవహారం వెలుగుచూసింది. మృతురాలి సెల్‌ఫోన్ డేటాను పరిశీలించిన దర్యాప్తు అధికారులు ఆమెతో శివరాం చేసిన వాట్సప్ సందేశాలను గుర్తించారు. దీంతో అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే శివరాం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు.
ఖమ్మం పట్టణంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి తుమ్మల హాట్ కామెంట్స్ చేసారు . మంత్రి పువ్వాడ ను ఉద్దేశించి మాట్లాడుతూ మేము బందిపోట్లం కాదు బరాబర్ గా పట్టపగలు మీ ముందుకు వచ్చాము అంటూ సవాల్ విసిరారు . విజయం సాధించి తీరుతాం అంటూ ధీమా వ్యక్తం చేశారు. కొన్నేళ్లుగా ఖమ్మం ప్రాంత ప్రజలు భయాందోళనతో జీవితం సాగిస్తున్నారని , మీ కోసం ఎంత దూరమైనా మీ వెంట ఉంటానని తుమ్మల అన్నారు.
సింగరేణి కార్మికులకు శుభవార్త. సింగరేణి కార్మికులకు రూ.1.53 లక్షల దసరా బోనస్ ప్రభుత్వం ప్రకటించింది. దసరా బోనస్ కింద రూ.711 కోట్లు విడుదల చేసింది. దీంతో ఓక్కో కార్మికుడికి రూ.1.53 లక్షల మొత్తాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సంస్థలో పని చేస్తున్న 42 వేల మంది కార్మికులకు దీనిని వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. ఒకట్రెండు రోజుల్లో పండగ అడ్వాన్స్‌ను కూడా చెల్లించనున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు.
జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ హలీ వరంగల్ కు వెళుతూ మధ్యాహ్నం జనగాంలో ఆగి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న జమా మసీదులో ప్రార్థన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందుతుందని పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ లో అమలవుతున్నాయని చెప్పారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కరీంనగర్ బస్సు యాత్రపై కరీంగనర్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని బలవంతంగా కరీంనగర్ తీసుకొచ్చారని.. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియకుండానే ప్రచారానికి వచ్చారని సెటైర్ వేశారు. తమ పార్టీ అభ్యర్థి ఎవరో తెలియకుండా ప్రచారం చేసిన ఘనత రాహుల్ గాంధీదేనని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఈ సందర్భంగా గంగుల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రూ.80 వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో లక్ష కోట్లు దోచుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వాదన వింతగా ఉందని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమ నేతలంతా తిరిగి బీఆర్ఎస్ లో చేరుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి, మామిళ్ల రాజేందర్ లు ఈరోజు బీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… యుద్ధాలు చేయాల్సి వచ్చినప్పుడల్లా జిట్టా తోడుగా ఉన్నారని కొనియాడారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆయన విమర్శలు గుప్పించారు. నోట్ల కట్టలతో దొరికిన రేవంత్ రెడ్డి… ఎన్నికల్లో డబ్బులు పంచను అని ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణను ఇచ్చామని కాంగ్రెస్ చెప్పుకుంటోందని… కానీ, ఎన్నో బాధలు పెట్టిన తర్వాతే రాష్ట్రాన్ని ఇచ్చిందని అన్నారు. ఎన్నో పోరాటాలు చేసిన తర్వాతే తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. తెలంగాణను ఇవ్వక తప్పని పరిస్థితిని కల్పించింది బీఆర్ఎస్ పార్టీనే అని అన్నారు.





Total views : 81790