Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Latest News తెలంగాణలో మోదీ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు..

తెలంగాణలో మోదీ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు..

by CVR NEWS
తెలంగాణలో మోదీ పర్యటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు

భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో భాగంగా దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ సూచనలపై దేశవ్యాప్తంగా ప్రజలు వివిధ కోణాల్లో చర్చించుకుంటున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోడీ సూచనలు వైఫల్యానికి నిదర్శనమని తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో… దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి పౌరులు కొన్ని త్యాగాలు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ వేదికగా పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ప్రధాని చేసిన ఈ సూచనలు ఆయన ప్రభుత్వ పన్నెండేళ్ల వైఫల్యానికి నిదర్శనమని రాహుల్ విమర్శించారు.కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్‌ల అమలుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు వేచి చూసిన మోడీ ప్రభుత్వం, గత వారం గెజిట్ నోటిఫికేషన్ల ద్వారా ఈ కార్మిక వ్యతిరేక చట్టాలను దొంగచాటుగా అమల్లోకి తెచ్చిందని ఆయన విమర్శించారు. ఈ కొత్త కోడ్‌లు దేశంలోని కోట్లాది మంది కార్మికుల హక్కులను కాలరాస్తాయని, ‘హైర్ అండ్ ఫైర్’ విధానాన్ని ప్రోత్సహిస్తాయని ఆయన ఆరోపించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున ‘శ్రామిక్ న్యాయ్’ పేరుతో ఐదు పాయింట్ల ఎజెండాను ఖర్గే ప్రకటించారు. ప్రభుత్వ విభాగాల్లో కాంట్రాక్టు నియామకాలను నిలిపివేస్తామని, మోదీ ప్రభుత్వం నీరుగార్చిన కార్మిక చట్టాలను తిరిగి సమీక్షిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: