Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Latest News తమిళనాట ఘన విజయం సాధించిన విజయ్ పార్టీ టీవీకే..

తమిళనాట ఘన విజయం సాధించిన విజయ్ పార్టీ టీవీకే..

by CVR NEWS
తమిళనాట ఘన విజయం సాధించిన విజయ్ పార్టీ టీవీకే

తమిళనాడు రాజకీయ యవనికపై ఒక నవశకం ఆరంభమైంది. నిన్నటి వరకు వెండితెరపై ‘దళపతి’గా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఒక ధృవతార.. నేడు ప్రజాక్షేత్రంలో అజేయమైన నాయకుడిగా ఉదయించారు. విమర్శలను ధీటుగా ఎదుర్కొని.. అడ్డంకులను అధిగమించి.. తన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’తో కేవలం రెండేళ్లలో ఒక పొలిటికల్ సునామీని సృష్టించారు. అసంభవం అనుకున్న చోట సుసాధ్యం చేసి చూపిస్తూ.. కోట్లాది మంది అభిమానుల నమ్మకాన్ని ఓట్లుగా మలచుకుని ఇప్పుడు అధికార పీఠం దిశగా విజయకేతనం ఎగురవేస్తున్నారు. సామాన్య నటుడిగా జీవితాన్ని ప్రారంభించి… . ఒక రాష్ట్ర గమనాన్ని మార్చే దిశగా సాగుతున్న విజయ్ రాజకీయ ప్రస్థానం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. విజయ్ సృష్టించిన ఈ రాజకీయ సునామీ వెనుక ఉన్న అసలు కథేంటి..?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ TVK దూసుకుపోతోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను TVK అత్యధిక స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో విజయ్‌ కుటుంబసభ్యులు, పార్టీ శ్రేణులు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే నటి త్రిష విజయ్‌ ఇంటికి చేరుకున్నారు. ఇక ఫలితాలకు ముందు విజయ్ విజయం సాధించాలంటూ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె తిరుమల నుంచి చెన్నై చేరుకొని విజయ్ నివాసానికి వెళ్లారు. తమిళనాట ఫలితాల్లో విజయం సాధించిన విజయ్‌కు అభినందనలు తెలిపారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012434
Total views : 75121

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.