Monday, July 13, 2026
News Navigation
Monday, July 13, 2026
News Navigation

Breaking

Monday, July 13, 2026
Home International హర్మూజ్ జలసంధి వద్ద యుద్ధ మేఘాలు..

హర్మూజ్ జలసంధి వద్ద యుద్ధ మేఘాలు..

by CVR NEWS

ప్రపంచ దేశాల గుండెల్లో హార్మూజ్ జలసంధి అలజడి రేపుతోంది. చమురు రవాణాకు కీలకమైన ఈ మార్గంలో ఇరాన్-అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన వందలాది షిప్పులు వారాల తరబడి అక్కడే చిక్కుకుపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళన మొదలైంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ ప్రకటించగా, ఇరాన్ మాత్రం ‘మా పర్మిషన్ లేనిదే ఒక్క అడుగు కూడా వేయనివ్వం’ అంటూ హెచ్చరికలు జారీ చేసింది.ప్రపంచ చమురు అవసరాల్లో దాదాపు 20 శాతానికి పైగా తీర్చే ‘హార్మూజ్ జలసంధి’ ఇప్పుడు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తోంది. గత ఫిబ్రవరిలో మొదలైన ఇరాన్-అమెరికా ఘర్షణలు ఇప్పుడు పతాక స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఇక్కడ డ్యూయల్ బ్లాక్-అవుట్ నడుస్తోంది.జలసంధిలో చిక్కుకున్న సుమారు 850కి పైగా వాణిజ్య నౌకలను, 20 వేల మంది నావికులను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి అమెరికా ఈ ఉదయం ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’ను ప్రారంభించింది.అయితే, తమ సైన్యం అనుమతి లేకుండా ఏ నౌక కదిలినా దాడులు తప్పవని ఇరాన్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లాహి తీవ్రంగా హెచ్చరించారు.జస్క్‌తీరం వద్ద ఒక అమెరికా యుద్ధ నౌకపై ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరుకుంది. ఒకవైపు పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు జరుగుతున్నాయని ప్రచారం సాగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం క్షిపణులు గర్జిస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా యుద్ధనౌకలను మొహరించడంతో ఈ ఉద్రిక్తతలు ఎటు దారితీస్తాయోనని ప్రపంచ దేశాలు భయాందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisements

You may also like

Our Visitor

039993
Total views : 202828

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: