Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Andhra Pradesh భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించేలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికైంది.

భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించేలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికైంది.

by CVR NEWS

భావి భారత పౌరులైన విద్యార్థులకు చట్టసభల పనితీరుపై అవగాహన కల్పించేలా ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికైంది. సుమారు 300 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించి, సభా వ్యవహారాలను ప్రత్యక్షంగా వీక్షించారు. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు 1100 మంది విద్యార్థులు ప్రజాస్వామ్య దేవాలయాన్ని సందర్శించడం విశేషం. ప్రజా సమస్యలపై చర్చలు ఎలా జరుగుతాయి, చట్టాల రూపకల్పన ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా గమనించారు.​సభా విరామ సమయంలో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుతో పాటు ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, పత్తిపాటి పుల్లారావు, బోండా ఉమామహేశ్వరరావు తదితరులు విద్యార్థుల వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకుని దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులతో కలిసి గ్రూపు ఫోటోలు దిగారు. చట్టసభల వాతావరణాన్ని స్వయంగా చూడటం తమకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చిందని, ఈ పర్యటన తమలో సరికొత్త స్ఫూర్తిని నింపిందని విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisements

You may also like

Our Visitor

014091
Total views : 78950

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.