Sunday, August 16, 2026
News Navigation
Sunday, August 16, 2026
News Navigation

Breaking

Sunday, August 16, 2026
Home Film విజయ్‌ దేవరకొండ , రష్మిక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు…

విజయ్‌ దేవరకొండ , రష్మిక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు…

by CVR NEWS

విజయ్‌ దేవరకొండ , రష్మిక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వివాహం విషయంలో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా విజయ్‌ తొలిసారి ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. అభిమానులు పిలుచుకుంటున్నట్లుగానే తమ వివాహ వేడుకకు ‘విరోష్‌’ గా పేరు పెడుతున్నట్లు పేర్కొన్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’ సినిమాల్లో కలిసి నటించిన విజయ్‌, రష్మిక ప్రేమలో ఉన్నారంటూ గతంలో రూమర్స్‌ వచ్చాయి. దీనిపై వీరు అధికారికంగా స్పందించకున్నా.. సామాజిక మాధ్యమాల్లో పంచుకునే పోస్ట్‌లతో పరోక్షంగా ఆ వార్తలకు బలాన్నిస్తూ వచ్చారు. త్వరలోనే ఈ జంట వివాహ వేడుక కోసం జోరుగా ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇక ఎట్టకేలకు తాజాగా పెళ్లిపై స్పందించారు విజయ్ , రష్మిక. సోషల మీడియాలో స్పందిస్తూ.. తమ పెళ్లి ప్రకటన కూడా చేశారు. అఫీషియల్ గా పెళ్లి కార్డును షేర్ చేసిన ఈ ప్రేమ జంట.. తమ వెడ్డింగ్ ఈవెంట్ కి విరోష్ అనే పేరు కూడా పెట్టారు. తమ పెళ్లి ఈవెంట్ కు వెడ్డింగ్ ఆఫ్ విరోష్ అని పేరు పెడుతున్నట్టు తెలిపింది స్టార్ జంట. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌ ఇందుకు వేదిక కానున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26న ఈ జంట మూడుముళ్లతో ఒక్కటి కానుంది. ప్రస్తుతం ఇటు విజయ్‌ దేవరకొండ, అటు రష్మిక ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉన్నారు

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: