Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home National అయోధ్యలో వడివడిగా జరుగుతున్న ఏర్పాట్లు..

అయోధ్యలో వడివడిగా జరుగుతున్న ఏర్పాట్లు..

by Satya
Prime Minister Narendra Modi

అయోధ్యలో జనవరి 22న జరగనున్న శ్రీ రామ మందిర ప్రారంభోత్సవానికి వడివడిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈ క్రమంలో అయోధ్య నగరాన్ని అద్భుతంగా అలంకరిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో సూర్య స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. నయాఘాట్ సమీపంలోని లతా మంగేష్కర్ చౌక్‌ను అయోధ్య బైపాస్‌తో కలిపే ‘ధర్మమార్గం’ రహదారికి ఇరువైపులా 40 సూర్య స్తంభాలను ఏర్పాటు చేశారు. కాగా, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అనేక మందిని ఆహ్వానించింది. నాలుగు వేల మంది సాధువులు, 2,200 మంది ఇతర అతిథులకు ట్రస్టు ఆహ్వాన పత్రికలు పంపింది. ఆహ్వానాలు అందుకున్న వారిలో పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సీనీక్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, రజనీకాంత్, సంజయ్‌లీలా భన్సాలీ, అలియా భట్, రణబీర్ కపూర్, సన్నీ డియోల్, అజయ్ దేవ్‌గన్, చిరంజీవి, మోహన్‌లాల్, ధనుష్, రిషభ్ శెట్టి, ప్రభాస్, టైగర్ ష్రాఫ్, ఆయుష్మాన్ ఖురానా, అరుణ్ గోవిల్, దీపికా చిఖాలియా నటీనటులకు ఆహ్వానాలు అందాయి. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్టాటా వంటి వ్యాపారవేత్తలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. క్రీడాకారులలో సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లీ ఉన్నారు. రాజకీయ నాయకులలోమల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి,, డాక్టర్ మన్మోహన్ సింగ్, హెచ్‌డీ దేవెగౌడ, లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఉన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: