Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home International ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సాయం.

ఇరాన్‌కు రష్యా ఇంటెలిజెన్స్ సాయం.

by CVR NEWS

పశ్చిమాసియాలో యుద్ధ సమీకరణాలు మారిపోతున్నాయి. ఇరాన్‌కు రష్యా వ్యూహాత్మక మద్దతు ఇస్తోందని తాజాగా ఓ నివేదిక పేర్కొంది. అమెరికా యుద్ధవిమానాలు, యుద్ధనౌకలు, సైనిక స్థావరాల గురించి ఇరాన్‌కు రష్యా ‘రియల్‌ టైమ్‌ ఇంటెలిజెన్స్‌’ సహకారం అందిస్తోందని తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి..అమెరికా యుద్ధనౌకలు, విమానాలు, ఇతర సైనిక స్థావరాల సమాచారాన్ని ఇరాన్‌కు రష్యా చేరవేసిందని వెల్లడించింది. రష్యాకు చెందిన అధునాతన ఉపగ్రహ సేవలు ఇరాన్‌కు లభిస్తున్నాయని, అందుకే ఇరాన్‌ దాడుల సామర్థ్యం పెరిగిందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్‌ వద్ద పరిమిత సంఖ్యలోనే సైనిక ఉపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల రష్యా అందించే శాటిలైట్‌ చిత్రాలు వారికి ఉపయోగడుతున్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా, తన నిఘా, టార్గెటింగ్‌ సామర్థ్యాలను బాగా మెరుగుపరుచుకుంది. దాని ఫలితంగా ఇప్పుడు ఇరాన్‌ ప్రతీకార దాడులు చేయగలుగుతోంది.

ఉక్రెయిన్‌ యుద్ధంలో ఇరాన్, చైనా, ఉత్తర కొరియాలు రష్యాకు వివిధ రూపాల్లో సైనిక సహకారాన్ని అందించాయి. మరోవైపు అమెరికా నేరుగా ఉక్రెయిన్‌కు ఆయుధాలతోపాటు, ఇంటెలిజెన్స్‌ సహకారం అందించింది. ఉక్రెయిన్‌ నగరాలపై దాడికి రష్యా ఉపయోగిస్తున్న డ్రోన్‌లను ఇరాన్‌ సరఫరా చేసింది. అందుకే రష్యా ఇప్పుడు ఇరాన్‌కు ఇంటెలిజెన్స్‌ సహకారం అందిస్తోంది.

Advertisements

You may also like

Our Visitor

039507
Total views : 197343

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: