Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం..

నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం..

by CVR NEWS

ఆరు దశాబ్దాల నాటి పాత ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో నేటి నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి వచ్చింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైన నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం పన్ను నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ ఫైనాన్స్‌ చట్టం-2025ను నోటిఫై చేసింది. దేశ పన్నుల విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కొత్త చట్టం సిద్ధమయ్యింది. F&O ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ పెంపు, విదేశీ విహార ప్యాకేజీలు, విద్య-వైద్యం నిమిత్తం విదేశాలకు పంపే మొత్తంపై పన్ను తగ్గింపు.. ఇలా ఎన్నో కీలక నిబంధనలు నేటి నుంచి అమల్లోకి వస్తున్నాయి. పన్ను విధానాన్ని మరింత సులభంగా అర్థమయ్యేలా మార్చడమే కొత్త చట్టం లక్ష్యం. దీనిలో అసెస్‌మెంట్‌ ఇయర్, ప్రీవియస్‌ ఇయర్‌ అనే వ్యత్యాసాలను తొలగించి.. ఒకే ‘ట్యాక్స్‌ ఇయర్‌’ విధానాన్ని తీసుకొచ్చారు. గడువు ముగిసిన తర్వాత ఇన్‌కంట్యాక్స్‌ రిటర్నులు దాఖలు చేసినప్పటికీ, ఎలాంటి జరిమానా లేకుండా, టీడీఎస్‌ రిఫండ్‌ను క్లెయిం చేసుకునే వెసులుబాటు కల్పించారు.

Advertisements

You may also like

Our Visitor

018683
Total views : 89167

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.