Tuesday, August 25, 2026
News Navigation
Tuesday, August 25, 2026
News Navigation

Breaking

Tuesday, August 25, 2026
Home National తెలంగాణ సీఎం రేవంత్, కేరళ నేతల సమక్షంలో మేనిఫెస్టో ..

తెలంగాణ సీఎం రేవంత్, కేరళ నేతల సమక్షంలో మేనిఫెస్టో ..

by CVR NEWS

కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం యూడీఎఫ్‌ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేనిఫెస్టోను సతీశన్‌కు అందజేశారు. రాహుల్ గాంధీ గతంలో ప్రకటించిన ఐదు హామీలతో పాటు, పలు ఇతర వాగ్దానాలతో కూడిన ఈ మేనిఫెస్టోను యూడీఎఫ్‌ విడుదల చేసింది. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, కళాశాల విద్యార్థులకు నెలకు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయం అందజేత. అలాగే, యువత వ్యాపారాలు ప్రారంభించడానికి 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, అలాగే 3 వేల రూపాయల పెన్షన్‌, ఊమెన్ చాందీ పేరుతో అన్ని కుటుంబాలకు 25 లక్షల వరకు ఉచిత బీమా పథకం, వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు వంటి 6 ‘ఇందిరా హామీలు’ మేనిఫెస్టోలో పొందుపరిచారు. వీటితో పాటు, ‘జాబ్ వాచ్ టవర్ల’ ఏర్పాటు, వయనాడ్‌లో ఒక గిరిజన విశ్వవిద్యాలయం, అలాగే కోజికోడ్, తిరువనంతపురంలలో మెట్రో ప్రాజెక్టులను అమలు చేస్తామని హామీ ఇచ్చింది UDF..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: