హనుమకొండలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా వైభవంగా ప్రారంభమైంది . ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఈ మేళాను రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, సితక్క సంయుక్తంగా ప్రారంభించారు ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు మేళాలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడారు . వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగాలకు సంబంధించిన ఆధునిక పద్ధతులు, నూతన సాంకేతిక పరిజ్ఞానం, ప్రభుత్వ పథకాలపై అధికారులు అందిస్తున్న వివరాలను ఆసక్తిగా తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, రైతుల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇలాంటి మేళాల ద్వారా రైతులకు నూతన ఆలోచనలు, సాంకేతికతపై అవగాహన పెరిగి, దిగుబడులు పెంచుకునే అవకాశాలు విస్తరిస్తాయని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా రైతులు కూడా ఆధునిక పద్ధతులను అవలంభించి తమ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. ఈ మెగా రైతు మేళా రైతులకు ఒక మార్గదర్శక వేదికగా నిలిచి, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు తీసుకెళ్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
హనుమకొండలో రాష్ట్ర స్థాయి మెగా రైతు మేళా ప్రారంభం..
63
previous post





Total views : 75059