Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Latest News ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం..

ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం..

by CVR NEWS
ప్రముఖ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత RB చౌదరి దుర్మరణం పాలయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కన్నుమూశారు. సూపర్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ బ్యానర్‌పై తమిళ, తెలుగు, మలయాళం భాషల్లో అనేక విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. రంగం సినిమా ఫేమ్‌ హీరో జీవా ఆర్‌బీ చౌదరి తనయుడే. రాజస్థాన్‌కు చెందిన ఆర్‌బీ చౌదరి పూర్తి పేరు రతన్‌లాల్ భగత్‌రామ్ చౌదరి. వ్యాపార రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఆయన… మలయాళంలో ఆదిపాపమ్ అనే సినిమాతో నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. 1994 లో వచ్చిన కెప్టెన్‌ మూవీ.. ఆయన తొలి తెలుగు సినిమా. పవన్‌ కళ్యాణ్‌ నటించిన సుస్వాగతం తో ఘన విజయాన్ని అందుకున్న ఆయన సూర్యవంశం, రాజా, శీను, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, ప్రియమైన నీకు, శివరామరాజు, గోరింటాకు, సంక్రాంతి.. వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు నిర్మించారు. ముఖ్యంగా వెంకటేష్‌, నాగార్జునతో ఆయన అద్భుతమైన సినిమాలు నిర్మించారు. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఆర్‌బీ చౌదరి నిలిచారు. ఇప్పటివరకు 98 సినిమాలు నిర్మించిన ఆయన… విశాల్‌తో మకుటం సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్‌బీ చౌదరి మరణవార్తపై టాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని సంతాపం తెలిపారు.

సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత RB చౌదరి అకాల మరణంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయానని… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు సంతాప సందేశం పంపారు. తన మొట్టమొదటి సూపర్‌ హిట్‌ చిత్రం సుస్వాగతానికి ఆయనే నిర్మాత అని గుర్తు చేసుకున్నారు. చిత్ర నిర్మాణం, సంబంధిత వ్యాపారంపై సాధికారత ఆయనకి సొంతమన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని, చక్కటి పాటలు ఉండేలా చిత్రాలు నిర్మించారని… అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుందని పవన్ అన్నారు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆర్ బి చౌదరి కుటుంబానికి పవన్ కళ్యాణ్‌ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

012419
Total views : 75059

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.