బోర్డు చూస్తే ఎస్‌బీఐ ఏటీఎం.. లోపలికి వెళ్తే కటింగ్ షాపు..! బీహార్‌లోని పాట్నా సమీపంలో ఉన్న దానాపూర్‌లో వెలుగుచూసిన ఈ విచిత్రమైన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తోంది. దానాపూర్‌లోని ఒక రూమ్‌లో గతంలో ఎస్‌బీఐ ఏటీఎం ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల బ్యాంక్ దాన్ని మూసేసి.. ఆ ఖాళీ స్థలాన్ని వేరొకరికి అద్దెకు ఇచ్చింది. కానీ, బయట ఉన్న ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం’ బోర్డును తీసేయడం బ్యాంకు అధికారులు మర్చిపోయారు. అయితే ఆ స్థలాన్ని అద్దెకు తీసుకున్న వ్యక్తి.. బోర్డు అలాగే ఉంచి, లోపల ఏకంగా అద్దాలు, కుర్చీలు వేసి సెలూన్ షాపు పెట్టేశాడు. దీంతో బయట నుంచి చూసి డబ్బుల కోసం లోపలికి వెళ్లిన జనం.. అక్కడ హెయిర్ కటింగ్ చూసి బిత్తరపోతున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో మీమర్స్ పండగ చేసుకుంటున్నారు. బ్యాంకింగ్ భాషలో లోన్ల మాఫీని లేదా నష్టపోవడాన్ని ‘హెయిర్ కట్’ అంటారని.. ఇప్పుడు ఎస్‌బీఐ ఆ పదానికి లైవ్‌లో సరికొత్త అర్థం చెబుతోందంటూ నెటిజన్లు ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు.
బయట చూస్తే SBI ATM..
75
previous post





Total views : 75060